చైతు వేడుకలో టైటిల్ సాంగ్ వచ్చేసింది!

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం ‘బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ.. కంటి నిండ ఆశలతో మా సీతమ్మ… తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య.. సీత చెయ్యి పట్ట వచ్చె మా రామయ్య’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. మే 7 సాయంత్రం 4.30 గంటలకు ఈ పాటకు సంబంధించిన 30 సెకన్ల టీజర్‌ రిలీజ్‌ చేస్తామని, త్వరలోనే ఇదే పాటకు 90 సెకన్ల వీడియోను విడుదల చేస్తామని నిర్మాత కింగ్‌ నాగార్జున తెలిపారు.