HomeTelugu Trending'హిడింబ' రివర్స్ ట్రైలర్

‘హిడింబ’ రివర్స్ ట్రైలర్

Hidimbha Reverse Action Tra

టాలీవుడ్‌ నటుడు, ప్రముఖ యాంకర్‌ ఓకాంర్‌ తమ్ముడు .. అశ్విన్ బాబు హీరోగా అనిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘హిడింబ’. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్వేత మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, వికాస్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ప్రతి షాట్ ను రివర్స్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ కొత్తగా అనిపిస్తోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, కీలకమైన దృశ్యాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అనిల్ కన్నెగంటి గతంలో సందీప్ కిషన్ తో ‘రన్’ .. ‘ మంచు మనోజ్ తో ‘మిస్టర్ నూకయ్య’ .. కల్యాణ్ రామ్ తో ‘అసాధ్యుడు’ చేశాడు. అలాంటి ఆయన నుంచి వస్తున్న మరో సినిమానే, ‘హిడింబ’.

Recent Articles English

Gallery

Recent Articles Telugu