HomeTelugu Trending'హిట్‌-2' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘హిట్‌-2’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

The release date of Hit 2 m
నేచురల్‌ స్టార్‌ నాని తన సొంత బ్యానర్లో గతంలో నిర్మించిన చిత్రం ‘హిట్’. ఈ సినిమాలో హీరోగా విష్వక్సేన్ నటించాడు. ఆ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకి సీక్వెల్ ఉన్నట్టుగా అప్పుడే వెల్లడించారు. ‘హిట్ 2’ పేరుతో ఈ మధ్య కాలంలోనే సీక్వెల్ ను పట్టాలెక్కించారు.

ఈ సినిమాలో అడివి శేష్ -మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్‌లుగా నటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో అడివి శేష్ సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు.

‘హిట్-1’ డైరెక్టర్‌ శైలేష్ కొలను ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుందని ఆయన చెబుతున్నాడు. ‘మేజర్’ తరువాత అడివి శేష్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu