HomeTelugu Trendingఅంతమందినీ చాలా చక్కగా హ్యాండిల్‌ చేశాడు: ప్రభాస్‌

అంతమందినీ చాలా చక్కగా హ్యాండిల్‌ చేశాడు: ప్రభాస్‌

10 12‘ఈ సినిమాలో ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అన్న డైలాగ్‌ రాసింది సుజీత్‌. మాస్‌ పల్స్‌ ఏంటో అతనికి తెలుసు.’ అని అన్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా నటించిన సినిమా ‘సాహో’. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, భూషణ్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరిగింది. హీరో ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు పెద్ద పెద్ద టెక్నిషీయన్లు పనిచేశారు. మది, సాబు‌, శ్రీకర్‌‌, కమల్‌గార్ల సహకారం మర్చిపోలేనిది. కథ విన్న తర్వాత జాకీష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌, మందిరాబేడి వంటి నటులు వెంటనే ఒప్పుకొన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాను మొదటి రోజు నుంచి అనిల్‌ తడాని ఎంతో ప్రోత్సహించారు. సుజీత్‌ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నిక్కరేసుకొని వచ్చాడు. అప్పుడు అతనికి 24ఏళ్లు.(నవ్వులు) అప్పటికే మా ప్రొడక్షన్‌లో ‘రన్‌ రాజా రన్’ చేశాడు. అందరికీ నచ్చింది. 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిలా నాకు కథ చెప్పాడు. షూటింగ్‌ ప్రారంభమవడానికి ఏడాది ముందే చాలా వర్క్‌ చేశాడు. యాక్షన్‌ డైరెక్టర్లను కలిశాడు. ఆయా సన్నివేశాలు ఎలా తీయాలో వాళ్లతో ముందే ప్లాన్‌ చేశాడు. చాలా పెద్ద పెద్ద టెక్నిషియన్లను తీసుకున్నాడు. అంతమందినీ చాలా చక్కగా హ్యాండిల్‌ చేశాడు. ఇక హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పనిచేసింది. ముంబయి నుంచి వస్తూ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. యాక్షన్‌ సన్నివేశాలు కూడా బాగా చేసింది. తను సాహోకు పనిచేయడం మా అదృష్టం. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చా. కానీ, ఈసారి మాటివ్వకుండా చేయాలనుకున్నా. ట్రైలర్‌లో చూశారుగా ఛేజింగ్‌లు, జెట్‌లు అందుకే సమయం పట్టింది. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లాంటి స్నేహితులు అందరికీ ఉండాలి. రూ.100కోట్ల ప్రాఫిట్‌ను వదులుకుని మరీ సినిమా చేశారు’ అని ప్రభాస్‌ అన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మాట్లాడుతూ..’సాధారణంగా ఏ హీరో అభిమాని అయినా తన హీరో సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. కానీ, అందరి హీరోల అభిమానులు ప్రభాస్‌ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్‌ అన్ని విషయాల్లోనూ పాజిటివ్‌గా ఉంటాడు. ‘బాహుబలి’ తీస్తున్న సమయంలోనే తన తర్వాత చిత్రమేంటో ప్రభాస్‌ ఆలోచించారు. ఒక రోజు నా దగ్గరకు వచ్చి సుజీత్‌ కథ గురించి నాకు చెప్పాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే.. పెద్ద సినిమా చేసిన తర్వాత, పెద్ద డైరెక్టర్‌తో చేయాలని కాకుండా, సుజీత్‌ చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేశాడు. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా అయితే, నా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది అని చెప్పి చేశాడు. ఇంత పెద్ద సినిమాను సుజీత్‌ చేస్తాడా? అని చాలా మందికి అనుమానం ఉంది. ఫస్ట్‌లుక్‌ చూసినప్పుడే సినిమా స్థాయి ఏంటో తెలిసింది. టీజర్‌తో అది నిజమని అనిపించింది. ట్రైలర్‌తో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. చాలా బాగా చేశాడు. అంత పెద్ద టెక్నీషియన్స్‌, బడ్జెట్‌, స్టార్స్‌ను పెట్టుకుని చేయడం మామూలు విషయం కాదు. ఒక ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌లా సినిమా చేశాడు. ఇలాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకు ఎంతో ధైర్యం ఉండాలి. నిజంగా వాళ్ల అభినందిస్తున్నా. ఆగస్టు 30న పెద్ద రికార్డులు సృష్టిస్తుంది. ప్రభాస్‌ ఇప్పటికే ఆలిండియా స్టార్‌. ఇక సినిమాతో ఎంతో మరో మెట్టు ఎదుగుతాడు’ అని చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu