ఆఫ్రికాలో రామ్‌ చరణ్‌.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌?

రాజమౌళి నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గ్యాప్ తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. పూణేలో షూటింగ్ జరిగే సమయంలో రామ్ చరణ్ కు కాలు ఫ్యాక్చర్ కావడం వలన షూటింగ్ పోస్ట్ ఫోన్ చేశారు. నెల రోజుల రెస్ట్ తరువాత చరణ్ కోలుకున్నాడు.

అయితే, చరణ్ షూటింగ్ కు ఇంకా సమయం ఉండటంతో ఈ షార్ట్ టైమ్ భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా బయలుదేరి వెళ్లారు. టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్ లో విహరించనున్నారు. ఈ పార్క్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే. ఆ పార్క్ లో ఉండే జంతువులను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జంతు ప్రేమికులు వస్తుంటారు.