‘లైగర్‌’ కోసం హాలీవుడ్‌ స్టంట్ కొరియోగ్రాఫర్!

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ పాన్ ఇండియా సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే సందడి చేయనున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్‌ శిక్షణ కూడా తీసుకున్నాడు. పూరీ ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడు. అందుకే యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడం కోసం ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ని ‘లైగర్’ కోసం తీసుకొచ్చారు.

జాకీచాన్ సినిమాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ‘లైగర్’ కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే ఆండీ తన బృందంతో కలిసి స్పెషల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఫై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న ‘లైగర్’ ఈ సినిమా విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates