ఆ యాంకర్ ను మోసం చేశారట!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఓ బ్యూటీ ఈ మధ్య సినిమాల్లో కూడా బాగానే నటిస్తోంది. దానికి తగ్గ పారితోషికం కూడా ఆమెకు అందిస్తున్నారు. అయితే ఓ చిత్రబృందం మాత్రం ఆమెకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకుండా ఆమెను మోసం చేసినట్లు సమాచారం. ఈ మధ్య ఈ హాట్ యాంకర్ ఓ సినిమా ఆడిపాడింది. దానికోసం అమ్మడు కుదుర్చుకున్న మొత్తం ఒప్పందం 14 లక్షలు. అడ్వాన్స్ గా పది లక్షల సొమ్ము ఆమెకు అందింది. మరో నాలుగు లక్షల వరకు రావాల్సివుంది.
ఈలోగా మరో మూడు రోజుల పని అదనం కావడంతో మరో ఆరు లక్షలు ఇస్తామని చిత్రబృందం మాటిచ్చింది. అంటే అమ్మడుకి మొత్తం రావాల్సింది మరో పది లక్షలు. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవ్వడంతో ఈ బ్యూటీకి ఇవ్వాల్సిన డబ్బు సంగతి కాస్త మర్చిపోయారట. దీంతో ఆమె తెగ బాధ పడిపోతుంది. నమ్మి సినిమా చేస్తే ఇలా మోసం చేస్తారా..? అంటూ తన సన్నిహితుల వద్ద వాపోతుందట. మరి సినిమాకు లాభాలు వచ్చిన తరువాత అయినా.. ఆమెను గుర్తించి ఇవ్వాల్సిన డబ్బును ఇస్తారేమో.. చూడాలి!
 
 
Attachments