డబ్బు కోసం ఏం చేసినా తప్పులేదు… రష్మీ సంచలన వ్యాఖ్యలు


సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌పుడు అంతా చూసేది కేవ‌లం డ‌బ్బుల కోస‌మే. చాలా కొంద‌రు మాత్ర‌మే ఇక్క‌డ క్రియేటివ్ శాటిస్ఫాక్ష‌న్ కోసం ప‌ని చేస్తుంటారు. కానీ వంద‌లో 90 మంది మాత్రం క‌చ్చితంగా డ‌బ్బే ప్ర‌ధానం అంటారు. ఇప్పుడు ర‌ష్మీ గౌత‌మ్ కూడా ఇదే అంటుంది. ఇక్క‌డ అయితే డ‌బ్బుల కోసం.. లేదంటే మ‌న‌సుకు న‌చ్చే పాత్ర‌లు చేయాలి.
త‌న‌కు ఎలాగూ మ‌న‌సుకు న‌చ్చి.. త‌న‌ను తాను నిరూపించుకునే ఛాలెంజింగ్ పాత్ర‌లు ఎవ్వ‌రూ ఇవ్వ‌డం లేద‌ని చెబుతుంది ర‌ష్మీ. అందుకే డ‌బ్బు సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నాన‌ని సంచ‌ల‌న స‌మాధానం చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు ఒక్క ద‌ర్శ‌కుడు కూడా ఛాలెంజింగ్ రోల్ ఇవ్వ‌లేద‌ని.. క‌నీసం న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర కూడా రాలేద‌ని చెబుతుంది ఈ బ్యూటీ. కేవ‌లం త‌న‌ను గ్లామ‌ర్ డాల్‌గానే ద‌ర్శ‌కులు చూస్తున్నార‌ని.. త‌ను కూడా డ‌బ్బు వ‌స్తుంది కాబ‌ట్టి అలాంటి పాత్ర‌లే చేస్తున్నాన‌నంటుంది ర‌ష్మీ. త‌న‌కు కూడా మంచి పాత్ర‌లు చేయాల‌ని ఉంటుంద‌ని.. అలా రాక‌పోతే ఏం చేస్తాన‌ని ప్ర‌శ్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే ఎలాగూ క్రియేటివ్ శాటిస్ఫాక్ష‌న్ లేదు కాబ‌ట్టి క‌నీసం బ్యాంక్ బ్యాలెన్స్ అయినా పెంచుకోవాలి క‌దా అంటుంది ఈ భామ‌.

అయినా డ‌బ్బులు వ‌చ్చిన‌పుడు ఎక్స్ పోజింగ్ చేయ‌డం త‌ప్పేం కాదంటుంది ర‌ష్మీ గౌత‌మ్. అప్పుడ‌ప్పుడూ డ‌బ్బుల కోస‌మే కాకుండా క్రియేటివ్ సైడ్ కూడా ప‌ని చేయాల‌ని అనిపిస్తుంద‌ని.. అందుకే వెబ్ సిరీస్ చేయ‌డానికి ఆలోచిస్తున్న‌ట్లు చెప్పింది ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్. త్వ‌ర‌లోనే ఇది చేస్తాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఇండ‌స్ట్రీలో తాను ఉన్నది మాత్రం డ‌బ్బుల కోస‌మే అని కుండ బ‌ద్ధలు కొట్టేసింది ర‌ష్మీ గౌత‌మ్.