ఆ ఆలోచన నిర్మాతలను ముంచేస్తోంది!

tfiటాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాతకు వచ్చిన ఆలోచన ఇప్పుడు మిగిలిన నిర్మాతలను ముంచేస్తోందని సమాచారం. సదరు నిర్మాత టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్నాడు. ఆయనలో ఓ పంపిణీదారుడు కూడా ఉన్నాడు. సదరు నిర్మాత ఓ సినిమా సెట్స్ మీద ఉంది అంటే దాని బాగోతాలు తెలుసుకోవడానికి సినిమా సెట్ లో ఓ వ్యక్తిని పెట్టి అతడి ద్వారా వివరాలను సేకరిస్తున్నాడట. దాన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందనే విషయంలో ముందుగానే అంచనాకు వచ్చేస్తున్నాడు.

సినిమా బాగుందని రిపోర్ట్ వస్తే ఎంత ఖర్చు పెట్టైనా.. సరే దాన్ని దక్కించుకుంటున్నాడు. బాగోలేదు అంటే మాత్రం దాని జోలికి వెళ్ళడం లేదు. ఈ విషయం అతడి వరకు పరిమితమయినా.. పర్వాలేదు అనుకుంటే అతడి నుండి ఆ రిపోర్ట్ మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ కు వెళుతోందట. దీంతో వారు చెప్పిన రేటుకే నిర్మాత సినిమా కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో చిత్ర నిర్మాతలు దారుణంగా నష్టపోతున్నారని సమాచారం. పైరసీ, ఓవర్ బడ్జెట్ కంటే ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీను కుదిపేస్తోంది!