Homeతెలుగు వెర్షన్కాటసాని రామిరెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కాటసాని పరిస్థితేంటి ?

కాటసాని రామిరెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కాటసాని పరిస్థితేంటి ?

YSRCP MLA Katasani Rami Reddy

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. కాటసాని రామిరెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో కాటసాని రామిరెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. కాటసాని రామిరెడ్డి ఉమ్మడి కర్నూల్ జిల్లా అవుకు మండలం గుండ్ల శింగవరం గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రామిరెడ్డి శ్రీకృష్ణదేవరాయ దూర విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. కాటసాని రామిరెడ్డి కుటుంబం తొలి నుండి రాజకీయ కుటుంబం. పెదనాన్న కుమారుడు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాణ్యం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అల్లుడు భూమా బ్రహ్మానంద రెడ్డి (కుమార్తె భర్త) నంద్యాల మాజీ ఎమ్మెల్యే. కాటసాని రామిరెడ్డి 21 ఏళ్ళ వయస్సులో 1987 న మెట్టుపల్లె సింగిల్‌ విండో అధ్యక్షుడిగా రాజకీయ ప్రవేశం చేసి గుండ్ల శింగవరం గ్రామ సర్పంచ్ గా , అవుకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా , బనగానపల్లె జెడ్పిటీసీ సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ 2004 ఎన్నికల సమయానికి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు.

తాము మొదటి నుండి ఉన్న కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినా కొద్దీ కాలానికే నియోజకవర్గాల పునర్విభజనలో నూతంగా ఏర్పడ్డ బనగానపల్లె నియోజకవర్గంలో తన వర్గం బలంగా ఉండటంతో టీడీపీకి రాజీనామా చేసి చిరంజీవి సమక్షంలో పీఆర్పీ లో చేరి 2009 ఎన్నికల్లో బనగానపల్లె నుండి విజయం సాధించడం జరిగింది. పీఆర్పీ కాంగ్రెస్ పార్టీ లో విలీనం కావడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. 2014లో ఆ పార్టీ నుండి బనగానపల్లె నుండి పోటీ చేసి ఓటమి చవిచూసినా , 2019లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా రెండో సారి విజయం సాధించారు.

ఇంతకీ రాజకీయ నాయకుడిగా కాటసాని రామిరెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కాటసాని రామిరెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, పాణ్యం ,బనగానపల్లె నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో కాటసాని రామిరెడ్డికి బలమైన అనుచర గణం ఉంది. కాటసాని రామిరెడ్డి కుటుంబం కర్నూల్ జిల్లా ఫ్యాక్షన్ కుటుంబాల్లో ముఖ్యమైనది. ఫ్యాక్షన్ పోరులో సుమారు 11 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబం వీరిది. ఐతే, రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చిన్న కుమారుడు ఓబుల్ రెడ్డి పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువతుందని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. అయినప్పటికీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. కాటసాని రామిరెడ్డి మళ్ళీ గెలిచి అవకాశం ఉంది. ప్రజల్లో కాటసాని రామిరెడ్డి పై అభిమానం ఉంది. దీనికితోడు ఆర్థిక , అంగ బలం కలిగి ఉన్న కాటసాని రామిరెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి.. కాటసాని రామిరెడ్డి మళ్లీ గెలుస్తాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu