HomeTelugu Newsచియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ టీజర్ అప్‌డేట్

చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ టీజర్ అప్‌డేట్

Vikram Tangalan Teaser

హీరో చియాన్‌ విక్రమ్ తాజా చిత్రం తంగలాన్. పా రంజిత్ డైరెక్షన్‌లో అడ్వెంచరస్‌ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. 2024 జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా తంగలాన్ మూవీని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

తంగలాన్‌ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. తాజాగా తంగలాన్ టీజర్‌ను నవంబర్‌ 1న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూ కొత్త లుక్‌ షేర్ చేశారు.

విక్రమ్‌ తన సైన్యంతో సమరానికి వెళ్తున్నట్టుగా ఉన్న స్టిల్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. ఈ మూవీలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొత్తు కీలక పాత్రలు చేస్తున్నారు. పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు.

తంగలాన్ మూవీకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే మాళవికా మోహనన్‌ లుక్‌ విడుదల చేయగా.. డీగ్లామరైజ్‌డ్‌గా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలకే పరిమితమైన మాళవికా మోహనన్ తంగలాన్‌ మూవీలో ఇప్పటివరకు చూడని విధంగా కనిపించబోతున్నట్టు స్టన్నింగ్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ పా రంజిత్‌‌.

తంగలాన్ తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ నవంబర్ 1న హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో గ్రాండ్ గా జరగనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu