మిర్చి యార్డ్ రోశయ్య గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

 

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. కిలారి వెంకట రోశయ్య అలియాస్ మిర్చి యార్డ్ రోశయ్య. ప్రస్తుతం ప్రజల్లో మిర్చి యార్డ్ రోశయ్య పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. మిర్చి యార్డ్ రోశయ్య గా గుంటూరు పట్టణ వాసులకి సుపరిచతుడైన కిలారి వెంకట రోశయ్య ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రోశయ్య గుంటూరు జేకేసీ కళాశాలలో బీకాం పూర్తి చేశారు. రోశయ్య రాజకీయాల్లో రాకముందు ముందు గుంటూరు మిర్చి యార్డ్ కమిషన్ వ్యాపారంతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తుండేవారు.

రోశయ్య కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే.. తండ్రి కోటేశ్వరరావు గుంటూరు పురపాలక సంఘం కౌన్సిలర్ గా మరియు గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గా పనిచేశారు. మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాజీ కేంద్ర మంత్రి మరియు ప్రస్తుతం వైకాపా రాష్ట్ర స్థాయి నాయకుడు. రోశయ్య మిర్చి యార్డ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2008 లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనంతర కాలంలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 లో పొన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు.

ఇంతకీ రాజకీయ నాయకుడిగా మిర్చి యార్డ్ రోశయ్య గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో మిర్చి యార్డ్ రోశయ్య పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో మిర్చి యార్డ్ రోశయ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, పొన్నూరు నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో మిర్చి యార్డ్ రోశయ్యకి బలమైన అనుచర గణం ఉంది. కానీ, రోశయ్య పొన్నూరు ప్రజలకు ఆశించిన స్థాయిలో సేవ చేయలేదు. నిజానికి రోశయ్య పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఉన్నపటికీ ఆయన మనసంతా గుంటూరు పశ్చిమ మరియు తెనాలి నియోజకవర్గాల మీదే ఉంటుందని అంటారు.

అందుకు ప్రధాన కారణం.. మిర్చి యార్డ్ రోశయ్య వ్యాపారాలు మొత్తం ఈ రెండు నియోజకవర్గాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అంతేకాకుండా ఈ రెండు చోట్ల తనకు బలమైన అనుచర వర్గం ఉందని రోశయ్య బలంగా నమ్ముతున్నారు. అందుకే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నూరు నియోజకవర్గం మీద అసలు రోశయ్యకు ధ్యాసే లేదని టాక్. అలాగే రోశయ్య అనుచరుల పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువతుందని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. అయినప్పటికీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. రోశయ్య మళ్ళీ గెలిచి అవకాశం ఉంది.

ప్రజల్లో మిర్చి యార్డ్ రోశయ్య పై అభిమానం ఉంది. దీనికితోడు ఆర్థిక , అంగ బలం కలిగి ఉన్న మిర్చి యార్డ్ రోశయ్య జిల్లా రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి.. మిర్చి యార్డ్ రోశయ్య మళ్లీ గెలుస్తాడని గుంటూరు ప్రాంత ప్రజలు భావిసున్నారు. ఐతే, వైసీపీ పార్టీ కింది స్థాయి నాయకులు మాత్రం మిర్చి యార్డ్ రోశయ్య విషయంలో అసంతృప్తిగా ఉన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates