HomeTelugu Trendingశ్రీకృష్ణుడి పాత్రలో హృతిక్‌ రోషన్‌.!

శ్రీకృష్ణుడి పాత్రలో హృతిక్‌ రోషన్‌.!

9 18
సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మాములు సోషల్ కథలతో పాటుగా చారిత్రాత్మక నేపధ్యం కలిగిన కథలతోను అలానే పౌరాణిక కథలతోను సినిమాలు తీస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో భాగంగానే మధు మంతెన మహాభారతం సినిమాను తీస్తున్నారు. ఇందులో భారీ క్యాస్టింగ్ ఉండటం విశేషం. మహాభారతం అంటే గుర్తుకు వచ్చే పాత్రల్లో ముఖ్యమైన పాత్ర శ్రీకృష్ణుడు.

ఈ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. గతంలో ఈ పాత్రలో అక్షయ్ లేదా అమీర్ ఖాన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడి పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారని అంటున్నారు. హృతిక్ రోషన్ శ్రీకృష్ణుడి పాత్రలో నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇక ఇందులో ద్రౌపతి పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. బాజీరావ్ మస్తానీ, పద్మావతి సినిమాతో దీపికా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకు దీపికా కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది. మూడు భాగాలుగా సినిమాను విడుదల చేస్తారట. మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తారట. ఈ సినిమా ద్రౌపతి కోణంలో చిత్రికరించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu