HomeTelugu TrendingSSMB29: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్‌ హీరో?

SSMB29: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్‌ హీరో?

ssmb29SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు- ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతునే ఉన్నాయి. 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ నటీనటుల పేర్లను సైతం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో లొకేషన్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనుంది. ఇప్పటికే సెట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. లొకేషన్ లో సెట్ వర్క్ మొదలైందని, మే నెలాఖరుకు పూర్తవుతుందని తెలుస్తోంది. జూన్ లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ప్రపంచ వ్యాప్తంగా షూటింగ్‌ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ssmb291

కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విడుదల కానున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్ విలన్‌గా నటించనున్నట్లు టాక్‌. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ విలన్‌గా హృతిక్‌ కనిపించనున్నట్లు తెలుస్తుంది. దీని అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. త్వరలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాజమౌళి ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారని సమాచారం అందుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu