రివ్యూ: హైపర్

రేటింగ్: 2/5

సంగీతం: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా
ఎడిటింగ్‌: గౌతంరాజు
మాటలు: అబ్బూరి రవి
సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌
‘కందిరీగ’, ‘రభస’ చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నారు సంతోష్‌ శ్రీన్‌వాస్‌. రామ్‌,
సంతోష్‌ శ్రీన్‌వాస్‌ల సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో తాజాగా వస్తోన్న ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
చిత్రం ‘హైపర్‌’. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, గ్లామరస్‌ బ్యూటీ రాశీఖన్నా జంటగా వెంకట్‌ బోయినపల్లి
సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లి. పతాకంపై సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో ప్రముఖ
నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన ‘హైపర్‌’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల
ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి
తెలుసుకుందాం!
కథ:
నారాయణ మూర్తి(సత్యరాజ్) ప్లానింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తు ఉంటాడు. వృత్తే దైవంగా
భావించే నారాయణ నిజాయితీగా బ్రతుకుతుంటాడు. నారాయణ మూర్తి తనయుడు సూర్య(రామ్)కు
తండ్రంటే ప్రాణం. ఆయన చెప్పకముందే అన్ని పనులు చేసేస్తుంటాడు. తండ్రికి చిన్న కష్టం కూడా
రాకూడదని భావించే కొడుకు. గజ(మురళీశర్మ) అనే రౌడీషీటర్ నారాయమూర్తిని యాక్సిడెంట్
నుండి కాపాడతాడు. అప్పటినుండి గజతో, సూర్యకు స్నేహం ఏర్పడుతుంది. తన తండ్రికి భానుమతి
(రాశిఖన్నా) అనే అమ్మాయి నచ్చిందని ఆమెను ప్రేమిస్తాడు సూర్య. ఇలా సాఫీగా సాగిపోతున్న
వారి జీవితాల్లోని మినిస్టర్ రాజప్ప(రావు రమేష్) ఎంటర్ అవుతాడు. మాల్ పర్మిషన్ కోసం
నారాయణ మూర్తిని ఒక ఫైల్ మీద సంతకం పెట్టమని అడుగుతాడు. దానికి నారాయణ అంగీకరించకపోవడంతో
అతడ్ని భయపెట్టడానికి గజ సహాయం తీసుకుంటాడు. తండ్రి జోలికి మినిస్టర్ వస్తున్నాడన్న
సంగతి తెలుసుకున్న సూర్య మినిస్టర్ కే వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఆ మినిస్టర్ నారాయణ ఫ్యామిలీను
ఏం చేశాడు..? తండ్రికి వచ్చిన సమస్యను కొడుకు పరిష్కరించగలిగాడా..? సూర్య, భానుమతీల
ప్రేమ సంగతులేంటి..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
ఫైట్స్, పాటలు, ఫ్యామిలీ డ్రామాతో నడిచే పక్కా కమర్షియల్ సినిమా ‘హైపర్’. కథ, కథనంలో కొత్తదనాన్ని
కోరుకుంటున్న ప్రేక్షకులకు ఇటువంటి సినిమాలను ఈ మధ్య పెద్దగా ఆదరించడంలేదు. అయినా..
సరే రొటీన్ ఫార్ములాతో సినిమాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. రామ్ తన కెరీర్ లో చాలా
కమర్షియల్ సినిమాలు చేశాడు. కానీ ఇటువంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇదే.. నేను.. శైలజ
సినిమాతో హిట్ కొట్టి తన తదుపరి సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ హీరో ఇటువంటి నాసిరకం
కథను ఎలా ఎన్నుకున్నాడో.. ఆయనకే తెలియాలి. మొదటి నుండి మా సినిమా నుండి ఓ సందేశాన్ని
ఇవ్వబోతున్నామని చిత్రబృందం వెల్లడించింది. తండ్రీకొడుకుల అనుబంధంలో సాగే సందేశాత్మక
చిత్రం అంటే ఇంకేదో కొత్తగా ఉంటుందని ఊహించే ప్రేక్షకులకు ఈ సినిమా పెద్ద పరీక్ష. సినిమాలో
హైలైట్ అని చెప్పుకోవడానికి పెద్దగా ఏది అనిపించదు. అంతో ఇంతో ఇంటెర్వెల్ బ్యాంగ్ మాత్రం
ఆకట్టుకుంటుంది. ఆ తరువాత అయినా.. సినిమా హైప్ పెంచలేదు. సినిమా ఆఖరి నిమిషంలో
కూడా పాట పెట్టి ప్రేక్షకులను తెగ విసిగించేశారు. పోసాని కృష్ణ మురలి, రాశి ఖన్నా వంటి నటులు
తమ పాత్రలను ఎలా అంగీకరించారో.. తెలియట్లేదు. రావు రమేష్, సత్యరాజ్ లు మాత్రం తమ
నటనతో ఆకట్టుకున్నారు. జీబ్రాన్ మ్యూజిక్ అంతంత మాత్రంగా ఉంది. మణిశర్మ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
తో ప్రతి సీన్ ను ఎలివేట్ చేయడానికే ప్రయత్నించారు. కానీ కథ, కథనాల్లో కొత్తదనం లేనప్పుడు
అదనపు హంగులు ఎన్ని ఉన్నా వృధానే.. ఫోటోగ్రఫి పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ మైనస్ గా
నిలిచింది. సినిమా నిడివిని కావాలని పెంచినట్లుగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. మొత్తానికి
ఈ సినిమా బి, సి ఆడియన్స్ కు కూడా నచ్చుతుందా..? అంటే డౌటే..?

CLICK HERE!! For the aha Latest Updates