HomeTelugu Reviewsఅవికాగోర్‌ 'వధువు' ట్రైలర్‌

అవికాగోర్‌ ‘వధువు’ ట్రైలర్‌

Avika Gor Vadhuvu Trailer
అవికాగోర్‌ నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ ‘వ‌ధువు’. మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్‌ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చేయాలి అంటారు. కానీ ఈ పెళ్లిలో అన్ని రహస్యాలే అంటూ ట్రైల‌ర్ ప్రారంభమౌతుంది. ఇక ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే.. ఎవరో పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తుండగా.. మ‌రోవైపు.. పెద్ద పెద్ద కుటుంబాలలో పెళ్లి స‌మ‌యంలో ఎలాంటి రహస్యాలు ఉంటాయి? అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అనేదే ఈ సిరీస్ స్టోరీ అని అర్థమవుతోంది.

ఇక ఈ రహస్యాలను అవికా కనుగొంటుందా.. మిస్టరీని ఛేదిస్తుందా అనేది తెలియాలంటే వ‌ధువు చూడాల్సిందే. ఈ సిరీస్‍లో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ డిస్నీ+ హాట్‍స్టార్‌లో డిసెంబ‌ర్ 08 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu