HomeTelugu Trending'పిండం' సినిమాకి A సర్టిఫికెట్‌

‘పిండం’ సినిమాకి A సర్టిఫికెట్‌

pindam movie cencor completటాలీవుడ్‌ నటుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్, ట్రైల‌ర్‌లు విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తూ.. ఈ సినిమాను గర్భిణీ స్త్రీలు చూడవద్దని సెన్సార్ బోర్డు హెచ్చ‌రిక జారీచేసిన‌ట్లు తెలిపింది. ఈ సినిమాను డిసెంబ‌ర్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

కళాహి మీడియా పతాకం పై యశ్వంత్‌ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu