HomeTelugu Trendingఅలియా భట్‌ ఎవరో తెలియదు: క్రికెటర్‌

అలియా భట్‌ ఎవరో తెలియదు: క్రికెటర్‌

10 21బాలీవుడ్‌ సొట్ట బుగ్గల సుందరి అలియా భట్‌ ఎవరో తెలియదంటున్నాడు ఓ క్రికెటర్‌. ఐతే ఆమె జిఫ్ చిత్రం మాత్రం చాలా బాగుందని ప్రశంసించాడు. ఆ తర్వాత మీరు నటి అని తెలియదు మేడం అని ట్వీటాడు. అలియా బౌండరీ చిహ్నంతో బదులిస్తే తాను సిక్సర్లతో మాత్రమే డీల్‌ చేస్తానని అన్నాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్‌ అనుకుంటున్నారా?

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షలె గిబ్స్‌ గుర్తున్నాడా? మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలపై అతడిపై భారత్‌లో ఓ కేసు నమోదైంది. దాంతో అతడు ఉపఖండంలో పర్యటించడమే మానేశాడు. ఆటకు దూరమైనా క్రికెట్‌ రంగంలోనే ఇంకా కొనసాగుతున్నాడు. తాజాగా అతడో ట్వీట్‌ చేశాడు. ‘ట్విటర్‌ మీ ట్వీట్‌ను లైక్‌ చేస్తే కలిగే ఫీలింగ్‌’ అంటూ అలియా భట్‌ చిత్రం పెట్టాడు. దీనిని చాలా మంది రీట్వీట్‌ చేశారు. ఐతే ఒకరు ‘ఆమె ఎవరో తెలుసా?’ అని ప్రశ్నించాడు. ‘ఆమె ఎవరో తెలియదు. కానీ జిఫ్‌ బాగుంది’ అని బదులిచ్చాడు.

ఈ క్రమంలో కొందరు ఆలియా ఎవరో, ఏం చేస్తుందో గిబ్స్‌కు వివరించారు. అతడు అలియాను ట్యాగ్‌ చేస్తూ ‘మీరు నటి అని తెలియదు. కానీ జిఫ్‌ చాలా బాగుంది’ అని ట్వీట్‌ చేశాడు. అనూహ్యంగా ఆలియా దీనికి స్పందించింది. బౌండరీ సిగ్నల్‌ జిఫ్‌ను జత చేసింది. అప్పుడు గిబ్స్‌ ‘నేను సిక్సర్లతోనే డీల్‌ చేస్తాను మేడమ్‌ ఫోర్లతో కాదు..’ అని బదులిచ్చాడు. ఇంటర్నెట్‌లో వీరి సంభాషణ వైరల్‌గా మారింది. గిబ్స్‌ సఫారీ జట్టు తరఫున 90 టెస్టులు, 248 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 6,167, వన్డేల్లో 8,094 పరుగులు చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu