టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, లవర్ బాయ్ సిద్ధార్ద్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, ఇది సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇక ఈ చిత్రంలో జగపతి బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జగపతి బాబు స్పెషల్ పోస్టర్ ద్వారా మహా సముద్రంలో ఆయన చుంచు మామ అనే పాత్రలో కనిపించనున్నట్టు స్పష్టం చేశారు. అయితే పోస్టర్ లో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నట్టు అర్ధమవుతుంది.