HomeTelugu Trendingఅల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌

Corona positive for Allu Arకరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో విజృంభిస్తుంది. టాలీవుడ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోలు, ప్రొడ్యూసర్లు, ఇతర నటీనటులు వైరస్‌ బారినపడగా తాజాగా స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం ఆ జాబితాలో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు.

‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అవసరమైన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేట్‌ అయ్యాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ వెంటనే పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నాను. అవకాశం వస్తే తప్పకుండా అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. ప్రస్తుతానికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని కోరుతున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. కాగా ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈసినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu