HomeTelugu Trendingయోగిబాబు కూతురు బర్త్‌డే పార్టీలో కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు

యోగిబాబు కూతురు బర్త్‌డే పార్టీలో కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు

Kollywood star heroes at Yo 1

కోలీవుడ్‌ స్టార్ కమెడియన్‌ యోగిబాబు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ మంచి పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవలే ‘జైల‌ర్’ లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అయితే యోగిబాబు తాజాగా తన చిన్న కూతురు భరణి కార్తీక మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఈ వేడుక‌లో కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలంతా హాజరై సందడి చేశారు.

తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్, తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీ, విశాల్, జయం రవి, విజయ్ సేతుపతి, నటి ఖుష్బూ దంపతులు, శింబు తండ్రి టి రాజేందర్, డైరెక్టర్ ఏఎల్ విజయ్, సింగ‌ర్ మ‌నో త‌దిత‌రులు ఈ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu