Homeపొలిటికల్పవన్ జెండా, బాబు ఎజెండా కలిస్తే గెలుపు గ్యారంటీ !

పవన్ జెండా, బాబు ఎజెండా కలిస్తే గెలుపు గ్యారంటీ !

If Pawan Jenda and Babus agenda come together victory is guaranteed

2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు జనసేన నాయకులతో సమన్వయంతో పనిచేయాలని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారా ?, ముఖ్యంగా గ్రాఫ్‌ తక్కువగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల లిస్ట్ ను ప్రిపేర్ చేయాలని చంద్రబాబు సూచించారా ?, ఆ లిస్ట్ లోని సీట్స్ ను బాబు ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదు అని ప్లాన్ చేస్తున్నారు. శత్రువు ఎక్కడ బలహీనుడిగా ఉన్నాడో తెలిస్తే.. అక్కడ తన బలాన్ని పెంచుకుని విజయం సాధించొచ్చు. ఇదే ఇప్పుడు బాబు వ్యూహం. ఐతే, గ్రాఫ్‌ పెంచుకోకపోతే… వచ్చే ఎన్నికల్లో పక్కనపెట్టే అవకాశం కూడా ఉందని ఇప్పటికే జగన్ రెడ్డి స్పష్టం చేశాడు. కానీ, ఈ మాటే ఫాలో అయితే, ముందు జగన్ రెడ్డే తప్పుకోవాల్సి ఉంటుంది.

సీఎంగా జగన్ రెడ్డి గ్రాఫ్ ఏ మాత్రం బాగాలేదు అని అందరికీ తెలుసు. కాబట్టి.. వైసీపీ పార్టీ నియమం ప్రకారం అందరి కంటే ముందుగా జగనే తప్పుకోవాలి. అది కుదిరే పని కాదు. కావున, పార్టీలో చీలికలు తప్పనిసరిగా ఉంటాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే ఉండదని జగన్ రెడ్డి తన పార్టీ వారి దగ్గర స్పష్టం చేశాడు. ఈ లెక్కన రానున్న రోజుల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేఖత మరింతగా పెరగనుంది. అందుకే, విభేదాలు విడనాడి అన్నీ ప్రతిపక్ష పార్టీలు కలసి పనిచేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి కూడా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా చంద్రబాబు వ్యూహాలు సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా గేర్‌ మారుస్తున్నారు. 175 సీట్లకు 150 వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలు తీస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ జెండా, బాబు ఎజెండా కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి… ఈ లెక్కే నిజమయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నాడు అని, చంద్రబాబు ఎట్టి పరిస్ధితుల్లో మళ్లీ అధికారంలోకి రాడు అంటూ కొడాలి నాని లాంటి వారు జోస్యం చెబుతున్నారు. ఐతే, 2024లో ఎన్నికలు జరుగుతాయి. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం సర్వేలు కూడా చేయించింది. సర్వేల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గింది. అందుకే రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని ఆంధ్ర ప్రజలు ఓ అంచనాకు వచ్చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu