HomeTelugu Trendingమెగాస్టార్‌ తో ఇల్లీ బేబి!

మెగాస్టార్‌ తో ఇల్లీ బేబి!

2 4టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రం తరువాత 151 వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. చిరంజీవి సైరా సినిమా బిజీలో ఉండటం వలన ఆ సినిమా విడుదల అయ్యే వరకు కొరటాల మూవీని పెడింగ్‌ లో పెట్టారు. కొరటాల ప్రస్తుతం క్యాస్టింగ్ విషయంలో బిజీగా ఉన్నారు. అక్టోబర్ నెలాఖరులో 151 వ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.

కాగా, 151 వ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం కొరటాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. నయనతార, కాజల్ అగర్వాల్ ఇలా ఎన్నో పేర్లు తెరమీదకు వచ్చాయి. కాగా ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా పేరు తెరమీదకు వచ్చింది. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా ఇలియానా, టాప్ హీరోలందరితో నటించింది. మహేష్ బాబుతో పోకిరి, పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమాలు చేసింది. అయితే, టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా సడెన్ గా బాలీవుడ్ కు వెళ్ళిపోడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu