HomeTelugu Newsఆమెకు పెళ్లి అయిపోయింది.. నెటిజన్ల కామెంట్స్‌ చాలా బాధించేవి: శృతి హాసన్‌

ఆమెకు పెళ్లి అయిపోయింది.. నెటిజన్ల కామెంట్స్‌ చాలా బాధించేవి: శృతి హాసన్‌

12 7హీరోయిన్‌ శృతిహాసన్‌ గతంలో తన బరువుపై నెటిజన్లు కామెంట్లు చేసినప్పుడు చాలా బాధపడ్డానని అన్నారు. ఈ భామ ‘కాటమరాయుడు’ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. మ్యూజిక్‌ ఆల్బమ్‌లు, షోలతో బిజీగా గడిపారు. అయితే ఈ క్రమంలో కాస్త బరువెక్కారు. ఆమె ఫొటోల్ని చూసిన నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్లు చేశారు. దీని గురించి శృతి తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడారు. కొన్నాళ్లు అనారోగ్యంతో బాధపడ్డానని తెలిపారు. ‘ఆమెకు (శృతికి) పెళ్లి అయిపోయింది’, ‘ఆమె బాగా లావైపోయింది’.. ఇలాంటి చాలా కామెంట్లు చేశారు. మొదట విమర్శలు నన్ను చాలా బాధించేవి. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని ప్రజలకు తెలియదు. గత పదేళ్లలో కనీసం నన్ను నేను పట్టించుకునే సమయం కూడా లేదు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఇలాంటి దశ ఉంటుంది. నాకు కాస్త ప్రేమ, ప్రశాంతత, గౌరవం కావాలి. ఇన్నాళ్లు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ఇప్పుడు నన్ను అవి ఏ మాత్రం బాధించడం లేదు’ అని అన్నారు.

శృతి చాలా రోజుల తర్వాత ఇటీవల తమిళంలో హీరో విజయ్‌ సేతుపతి సినిమాకి సంతకం చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తమన్నా, ప్రభుదేవా నటించిన ‘కామోషీ’ సినిమాలోని ఓ పాటను కూడా శ్రుతి పాడారు. తన స్నేహితురాలు తమన్నా నటించిన సినిమాకు పాట పాడటం ఎంతో ప్రత్యేకమని ఇటీవల శృతి చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!