నా వక్షోజాలను దానం చేస్తా: రాఖీ సావంత్‌

నటి రాఖీ సావంత్‌.. షాకింగ్‌ కామెంట్స్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. తన వక్షోజాలను దానం చేస్తానని రాఖీ సావంత్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో.. ‘కళ్లను దానం చేస్తానని బాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్‌ ప్రమాణం చేశారు. ఇలా చాలా మంది తమ శరీరంలోని అవయవాలను దానం చేస్తూ మంచి పని చేస్తున్నారు. నేను కూడా ఎదో ఒకటి డొనేట్‌ చేయలనుకుంటున్నాను. నా వక్షోజాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాను.’ అని చివర్లో తన వక్షోజాలను ఎవరు దక్కించుకుంటారో చూద్దాం అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా స్టన్‌ అయ్యారు. ఇదేం నిర్ణయం అంటూ రాఖీపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

View this post on Instagram

#aishwaryaraibachchan #aishwaryarai

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on