HomeTelugu Trendingజనవరి 1న 'ఇందువదన'

జనవరి 1న ‘ఇందువదన’

Induvadana movie releasing
టాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇందువదన’. ‘ బిగ్ బాస్- 3’ లో తన భార్యతో కలిసి పాల్గొన్న వరుణ్‌ సందేశ్ ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని చిత్రాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి సైతం వెనుకాడని వరుణ్ సందేశ్ ‘ఇందువదన’లో మాత్రం హీరోగానే నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ‘ఇందువదన’ మూవీపై ఆసక్తిని పెంచేలా చేశాయి. ఈ సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో వరుణ్‌ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటించింది.

ఎమ్మెస్సార్ డైరెక్షన్‌ మాధవీ ఆదుర్తి నిర్మించిన ఈ సినిమాకి శివ కాకాని సంగీతం అందించారు. ఈ మూవీని 2022 జనవరి 1వ తేదీన వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నట్టు నిర్మాత మాధవీ తెలిపారు. ఈ ఫీల్‌గుడ్‌ లవ్ స్టోరీతో వరుణ్‌ సందేశ్ రీ-ఎంట్రీ ఇస్తున్నారని, ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు ఎమ్మెస్సార్ చెబుతున్నాడు. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది.

Varun Sandesh Induvadana On Jan 1st

Recent Articles English

Gallery

Recent Articles Telugu