HomeTelugu Trending'ఇందువదన' టీజర్‌

‘ఇందువదన’ టీజర్‌

Induvadana movie teaser
టాలీవుడ్‌లో హ్యాపీడేస్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్‌.. కొత్త బంగారులోకం తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్నాళ్ల బ్రేక్‌ తరువాత ‘ఇందువదన’ అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదలైంది. ఈ ట్రైలర్‌ లవ్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రతి ప్రేమ కథలో విలన్లు ఉన్నట్టే వీళ్లని విడదీయటానికి ఓ రౌడీ గ్యాంగ్‌ ఉంటుంది. వాళ్లొచ్చి హీరోని చంపే ప్రయత్నం చేయగా ‘వీడు చావడన్నా.. చావడు.. ఎందుకంటే నేను బతికే ఉన్నా కదా’ అని హీరోయిన్‌ పలికించిన హావభావాలు ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి.

టీజర్‌ ముగింపులో నాయిక దెయ్యంలా ప్రత్యక్షమవడం ఉత్కంఠని రేకెత్తిస్తోంది. ఈ టీజర్‌ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి ఎం.ఎస్‌.ఆర్‌. దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్‌ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. శివ కాకాని సంగీతం అందిస్తున్నారు. రఘుబాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, తాగుబోతు రమేశ్‌, ధన్‌రాజ్‌, మహేశ్‌ విట్టా తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu