HomeTelugu Trendingరామ్‌ చరణ్‌పై ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రసంశలు

రామ్‌ చరణ్‌పై ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రసంశలు

9 8

టాలీవుడ్‌ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ పై ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్‌ సుధా మూర్తి ప్రసంశలు కురిపించారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. చిన్నతనం లో ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలు చూసేదాన్నని చెప్పారు. ఆయన నటించిన ‘మాయాబజార్‌’, ‘దాన వీర శూర కర్ణ’, ‘సీతా స్వయంవరం’ చిత్రాలను చూశానన్నారు.

మనకు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ తనకు మాత్రం కృష్ణుడు అంటే ఎన్టీఆరే అని ఆమె అన్నారు. తాజాగా రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా చూశానని చెప్పారు. ఆ సినిమా తనకు బాగా నచ్చిందని. ఆ చిత్రంలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu