HomeTelugu TrendingKalki 2898 AD: ప్రభాస్ సినిమాకి అదొక్కటే మైనస్

Kalki 2898 AD: ప్రభాస్ సినిమాకి అదొక్కటే మైనస్

Kalki 2898 AD

Kalki 2898 AD: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమా గత నాలుగు సంవత్సరాలుగా సెట్స్‌ మీదే ఉంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలని చిత్రబృందం పేర్కొంది. అశ్విని దత్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఉన్నారు. అయితే.. ఈ మూవీకి పాన్‌ ఇండియా స్థాయిలో అయితే ప్రమోట్ చేయట్లేదనే అభిమానుల కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అప్పట్లో ఎంత ట్రోలింగ్‌కు గురైందో తెలిసిందే. తర్వాత వచ్చిన టీజర్ పర్వలేదు అనిపించింది.

తాజాగా ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలా డిజైన్ చేసిన బుజ్జి అనే అల్ట్రా మోడర్న్ కారును ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం ఒక ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేశారు. భారీగా ఖర్చు కూడా చేశారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ఈవెంట్‌కు సెలక్టివ్‌గా అభిమానులను, అలాగే వివిధ ప్రాంతాల నుంచి మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు.

కానీ ఈ ఈవెంట్ అనుకున్న స్థాయిలో సినిమాకు హైప్ తీసుకురాలేకపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ జరిగితే సోషల్ మీడియా హోరెత్తిపోవాలి. కానీ అలాంటిదేమీ కనిపించలేదు. టీజర్ కూడా జస్ట్ యావరేజ్ అన్నట్లు ఉండడం దీనికి కారణం.

ఈ సినిమా రేంజ్ ఏంటి.. జరుగుతున్న ప్రమోషనేంటి.. వదులుతున్న కంటెంట్ ఏంటి అని ప్రభాస్ అభిమానులే కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి భారీ చిత్రాలను రాజమౌళి ప్రమోట్ చేసే తీరు.. ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చే సినిమాలకు ఓ రేంజ్ లో పబ్లిసిటీ వచ్చేలా చేస్తారు.

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేశం మొత్తం తిరిగారు మూవీ టీమ్. అలాగే ఇతర దేశాల్లోనూ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. నాగ్ అశ్విన్ అండ్ టీం రాజమౌళిలా ప్రమోషన్లను డిజైన్ చేసి, కంటెంట్ మరింత ఎగ్జైటింగ్‌గా ఉండేలా చూసుకుంటేనే ఈ సినిమాకు మరింత బజ్‌ వస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu