HomeTelugu TrendingPrabhas: సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న ప్రభాస్‌.. ఎందుకో తెలుసా?

Prabhas: సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న ప్రభాస్‌.. ఎందుకో తెలుసా?

Is Prabhas taking a short b

Prabhas: హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌..బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లు వసూలు చేశాడు. వ‌రుస ఫ్లాప్స్‌ తరువాత ప్రభాస్‌కి ఇది మంచి కంబ్యాక్‌ మూవీగా నిలిచింది. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్రభాస్‌. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తునన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో ప్ర‌భాస్ తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తు న్నారు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలోని రాజా సాబ్ 60శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

ఈక్రమంలో డార్లింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అత‌డు తొంద‌ర్లోనే త‌న షూటింగుల‌కు విరామం ఇవ్వాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌. గ్యాప్ లేని షూటింగుల‌తో నుంచి విశ్రాంతి కోసం ప్ర‌భాస్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం.

త్వ‌ర‌లో యూరోప్ లో స‌ర్జ‌రీ చేయించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కూడా తెలిసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ ఇదే ఉత్సాహంలో స‌లార్ 2లోను న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. కొంత‌ విరామంతో తన జీవితంలో కొత్త శక్తిని నింపడానికి… త‌ర్వాత‌ తన కెరీర్‌పై దృష్టి సారించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభాస్ విరామం కేవలం ఒక నెల మాత్రమే. అతడు తిరిగి మార్చిలో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లనుప్రారంభించే అవకాశం ఉంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu