
Kalki 2898 AD TRP:
ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి, భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే, ఒక విషయంలో ఈ సినిమా పెద్దగా రాణించలేదు – అది సాటిలైట్ టీవీ. ఈ సమస్య సినిమాతో సంబంధం లేకుండా, టీవీ చానెల్స్‌కి తగ్గిపోతున్న క్రేజ్ కారణం అని చెప్పచ్చు.
సాటిలైట్ టీవీ చూసే ప్రజల సంఖ్య ఏడాది నుంచి ఏడాది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లేదా OTT ప్లాట్‌ఫామ్స్ ద్వారా కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. వార్తల కోసం కూడా యూట్యూబ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సినిమా ప్రీమియర్‌లు కూడా టీవీ కంటే డిజిటల్ మాధ్యమాల్లో ఎక్కువ చూపిస్తున్నారు.
ఉదాహరణకు, ప్రభాస్ నటించిన మరో సినిమా “సలార్” కూడా టీవీ ప్రీమియర్‌లో విఫలమైంది. తక్కువ TRP నమోదు చేసింది. “కల్కి” సింక్రాంతి స్పెషల్‌గా జీ తెలుగులో ప్రీమియర్ అయ్యింది. కానీ, TRP 5.26 మాత్రమే వచ్చింది. ఇది చాలా తక్కువ. అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురములో” 29.4 TRP సాధించగా, మహేశ్ బాబు “సరిలేరు నీకేవ్వరు”కి 23.4 TRP వచ్చింది.
ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సినిమాలు మాత్రం టీవీపై కొంచెం మెరుగ్గా రాణిస్తున్నాయి. ఉదాహరణకు, “గుంటూరు కారం”, “హనుమాన్” మంచి TRP సాధించాయి. కానీ ప్రభాస్ సినిమాలు ఎక్కువగా యూత్, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుండటంతో, టీవీలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోతున్నాయి.
ఇదే కారణంగా “కల్కి”, “సలార్” వంటి సినిమాలు టీవీపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. అందుకే, ఇప్పుడు ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు మళ్లుతున్నారు.