
Here’s why Kalki 2898 AD missed 2000 crores mark:
మహానటి సినిమాతో అందరి మనసును గెలుచుకున్న నాగ్ అశ్విన్, సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు.
సినిమాలో మహాభారతం సంఘటనలను భవిష్యత్తుతో కలిపి, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగ్ అశ్విన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు వసూలు చేసింది. అయితే, మొదటి భాగంలో మిస్టరీలు సస్పెన్స్‌గా మిగిలిపోవడంతో ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా మీడియా సభ్యులతో మాట్లాడిన నాగ్ అశ్విన్, కల్కి 2898 AD ఇంకా రూ. 2000 కోట్లు వసూలు చేసే అవకాశం కోల్పోయిందని తెలిపారు. కృష్ణుడి పాత్ర కోసం నీడను కాకుండా మహేష్ బాబును తీసుకుని ఉంటే సినిమా వసూళ్లు మరింత ఎక్కువగా ఉండేవని అభిప్రాయపడ్డారు.
రెండో భాగంలో కృష్ణుడి పూర్తి స్థాయి పాత్రపై ఆలోచిస్తే, మహేష్ బాబును కృష్ణుడిగా ఎంపిక చేస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగా, రెండో భాగంపై ఇంకా ఎక్కువ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో కనిపిస్తారా? అన్నదాని పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ALSO READ: పెద్ద హీరోల కారణంగా Kollywood కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?