HomeTelugu Trendingపచ్చని పొలాల్లో ఇస్మార్ట్‌ పోరీ.. ఫొటోలు వైరల్‌

పచ్చని పొలాల్లో ఇస్మార్ట్‌ పోరీ.. ఫొటోలు వైరల్‌

5 4టాలీవుడ్‌ లోకి సవ్యసాచి సినిమాతో అడుగుపెట్టిన హీరోయిన్ నిధి అగర్వాల్. నాగచైతన్యను మాస్ హీరోగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. సినిమా ఫెయిల్ కావడంతో నిధి అగర్వాల్ కు ఆఫర్లు వస్తాయా అనుకున్నారు. సినిమా షూటింగ్ దశలో ఉండగానే మిస్టర్ మజ్ను సినిమా సినిమాలో అవకాశం వచ్చింది. అఖిల్ హీరోగా చేసిన మూడో సినిమా. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.

వరసగా ఆమె నటించిన రెండు సినిమాలు ఫెయిల్ కావడంతో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రావేమో అనుకున్నారు. ఇదే సమయంలో నిధికి పూరి ఇస్మార్ట్ శంకర్ నుంచి పిలుపు రావడం.. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో.. నిధి అగర్వాల్ పండుగ చేసుకుంది. ముచ్చటగా మూడో సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటుగా నిధి బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్నది. సినిమాలు చేస్తూనే నిధి అగర్వాల్ ఫోటో షూట్ చేస్తున్నది. తాజాగా ఈ అమ్మడు పంటపొలాల్లో ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu