HomeTelugu Trendingసుష్మితా సినిమాలో హీరోయిన్‌గా జాను!

సుష్మితా సినిమాలో హీరోయిన్‌గా జాను!

Jaanu Gouri G. Kishan as
అక్కినేని కోడలు సమంత, శర్వానంద్‌ హీరో,హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘జాను’. ఈ సినిమాలో జాను చిన్నప్పటి సన్నివేశాల్లో (యంగ్‌ సమంతగా) నటించిన గౌరీ జి కృష్ణ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ‘జాను’ మాతృక, తమిళ చిత్రం ‘96’లోనూ అదే పాత్ర చేశారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెల నిర్మించనున్న ఫస్ట్‌ సినిమాలో గౌరీ జి కృష్ణకు హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లు సమాచారం. ‘జాను’లో టీనేజ్‌ అమ్మాయిగా పరిచయమైన ఈ అమ్మడు.. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతుందన్నమాట. సంతోష్‌ శోభన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు వినికిడి. గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సుష్మిత ఓ చిత్రం నిర్మించనున్నారు. తమిళ సినిమా ‘8 తొట్టకల్‌’కు రీమేక్‌ అట. తమిళ సినిమా దర్శకుడు శ్రీ గణేశ్‌, తెలుగు వెర్షన్‌కు సైతం దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది‌. త్వరలో సెట్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu