HomeTelugu Big Storiesపెళ్లి కొడుకుగా ముక్కు అవినాష్‌.. ఫొటో వైరల్‌

పెళ్లి కొడుకుగా ముక్కు అవినాష్‌.. ఫొటో వైరల్‌

Jabardasth avinash pic goes

లాక్‌డౌన్‌ సమయంలో పలువురు సెలబ్రెటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో జబర్ధస్థ్ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అవినాష్ తన ఇన్‏స్టాగ్రామ్‏లో పోస్ట్ చేసిన ఫొటోతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పూర్తిగా పెళ్లి కొడుకుగా ముస్తాబై తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేశాడు అవినాష్. దీంతో అవినాష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అవినాష్ నిజంగానే పెళ్లిచేసుకోబోతున్నాడా ? లేదా.. ఏదైనా షో కోసం ఇలా రెడీ అయ్యాడా? అనేది తెలియాల్సి ఉంది. జబర్దస్థ్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన అవినాష్.. ఆ తర్వాత ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యాడు. బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు అవినాష్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu