మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా నయన్!

దక్షిణాది చిత్రాలలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి నయనతార. ఒకపక్క సీనియర్ హీరోలతో నటిస్తూనే మరో పక్క యంగ్ హీరోలతో సైతం జత కడుతోంది. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్
ఆఫ్ చెన్నై’గా ఆమె పేరు మారు మ్రోగుతుంది.

ఈ స్థానం ఆమెకు దక్కడం ఇది రెండోసారి. గతేడాది కూడా నయనతారదే అగ్రస్థానం. మరోసారి తనకు ఈ ఛాన్స్ రావడంతో సంతోషంలో మునిగిపోతోంది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నాను అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది.

దీనికి కారణం అభిమానులే అని… ఇప్పుడు నటిగా తనపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ‘డోరా’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. అలానే మరో మూడు తమిళ చిత్రాల్లో నటించడానికి ఆమె అంగీకరించింది.