HomeTelugu Big Storiesవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమానికి చిరంజీవి మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమానికి చిరంజీవి మద్దతు

Mega star Chiranjeevi suppo

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, రాజ్యసభ మాజీ సభ్యుడు మెగాస్టార్‌ చిరంజీవి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతనే ఉ‍న్నాయని పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉందని తెలిసి గర్వించామని చిరంజీవి గుర్తుచేశారు. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామనడం దారుణం అని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని చిరంజీవి పిలుపునిచ్చారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం’ అంటూ చిరంజీవి పిలుపునిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu