Homeతెలుగు Newsచంద్రబాబు సైబర్‌ నేరానికి పాల్పడ్డారు.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్‌

చంద్రబాబు సైబర్‌ నేరానికి పాల్పడ్డారు.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్‌

14 2తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. డేటా వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు సైబర్‌ నేరానికి పాల్పడ్డారని జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం డేటా టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చింది? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సైబర్‌ నేరాలు జరగలేదేమో. ఇటీవల ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై దాడుల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తయారుచేసింది. ప్రజల ఆధార్‌ వివరాలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఎలా వచ్చాయి? ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఈ వివరాలు ఎలా వచ్చాయి? ఎవరికీ అందుబాటులో ఉండని మాస్టర్‌ కాపీ ఆ సంస్థకు ఎలా వచ్చింది? కేంద్ర ఎన్నికల సంఘం డేటా సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చింది? బ్యాంకు ఖాతా వివరాలు సేవామిత్ర యాప్‌లో కనిపిస్తున్నాయి. వారి వద్ద ప్రజల సమాచారం ఉంటే రేపు మోసాలు జరగవా?’ అని జగన్‌ ప్రశ్నించారు.

‘ టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ డేటా పంపించారు. ఆ ఓటరు ఎవరు? ఏ పార్టీ అభిమాని? అని టీడీపీ శ్రేణులు వారిని ప్రశ్నించాయి. సర్వే పేరుతో గ్రామాలకు వెళ్లారు. ఓ పద్దతి ప్రకారం ఓట్లు తొలగించారు. రెండేళ్లుగా పథకం ప్రకారం ఈ పని చేశారు. సీఈసీ విడుదల చేసిన ఓటర్ల జాబితాను మేం పరిశీలించాం. 2014 ఎన్నికల్లో మేం ఓడిపోయింది కేవలం 5లక్షల ఓట్ల తేడాతోనే గనక జాగ్రత్తగా ఓటర్ల జాబితాను పరిశీలించాం. అప్పుడే డూప్లికేట్‌ ఓట్లు ఉన్నాయని గ్రహించి ఫిర్యాదు చేశాం. 24 పెన్‌డ్రైవ్‌ల్లో 59 లక్షల ఓట్లకు సంబంధించిన సమాచారం ఈసీకి అందజేశాం. వివిధ కేటగిరీల్లో 59 లక్షల ఓట్లు ఉన్నాయని కేసు పెట్టాం. నకిలీ ఓట్లు తొలగించాలని కోరుతూ ఫారం -7 కింద మేం దరఖాస్తులు పెడుతున్నాం. ఓటు నమోదు, తొలగింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అసలు తప్పు ఎక్కడ జరిగిందో ప్రశ్నించాలి. ఇలాంటి పనులు చేసిన వారిపై కేసులు పెట్టేలా చూడాలని మేం గవర్నర్‌ను కోరాం. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెడతారు. ఫొటోతో సహా వివరాలు చోరీ చేసి ఇవ్వడం నేరం. చేయకూడని పనులు చేసి ఏపీ -తెలంగాణ మధ్య వివాదాలు రేపుతున్నారు’ అని జగన్‌ ‌మండిపడ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu