Homeతెలుగు వెర్షన్జగన్ రెడ్డి తోపు కావొచ్చు, కానీ బాబు ఆ తోపుకే తోపు

జగన్ రెడ్డి తోపు కావొచ్చు, కానీ బాబు ఆ తోపుకే తోపు

Jagan Reddy may be Topu but Babu is only Topu to that Topu

క్షేత్ర‌స్థాయిలో వైఎస్ జ‌గ‌న్‌ రెడ్డికి నిజంగా పట్టు ఉందా ?, క్షేత్ర‌స్థాయిలో జగన్ ను ఎదుర్కోడం అసాధ్య‌మా ?, ముఖ్యంగా పోల్ మేనేజ్‌మెంట్‌లో జగన్ రెడ్డి పెద్ద తోపు అని, ఆయ‌న్ను ఢీకొట్టే వారు ఇప్పట్లో ఎవ్వరూ లేర‌ని కూలీ మీడియా గొప్పలు పోతుంది. కానీ నీలి మీడియా వాస్తవాలను మర్చిపోతే ఎలా ?, తెలుగునాట పోల్ మేనేజ్‌మెంట్‌ ను ప్రవేశ పెట్టిందే చంద్ర‌బాబునాయుడు అని గతంలో వెంకయ్య నాయుడు గారే ఘనంగా చెప్పారు. ఐతే, 2019 ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న చంద్ర‌బాబును జ‌గ‌న్ రెడ్డి క‌ట్ట‌డి చేశాడు అని నీలి మీడియా ఇప్పుడు ప్రచారం చేస్తోంది.

ఇందులో నిజం ఉంది. కానీ, అప్పుడు కేసీఆర్ సాయం వల్లే.. జగన్ రెడ్డికి లబ్ది చేకూరింది. చంద్రబాబుకు నిధులు సమయానికి అందలేదు. అంతమాత్రమా జగన్ రెడ్డే తోపు, తురుము అంటే ఆశ్చ‌ర్యంగా ఉంది. అసలు జ‌గ‌న్ పాల‌న‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎంత దారుణంగా జరిగాయో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. ఉదాహరణకు చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఘోర ప‌రాజ‌యాన్ని బలవంతంగా అంటగట్టారు.

దీన్ని ఉదాహరణగా చూపిస్తూ.. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ రెడ్డిను ఎదుర్కోవ‌డం అంత సులువైన ప‌నికాద‌ని కూలీ మీడియా భజన మొదలు పెట్టింది. చంద్ర‌బాబుకు పోల్ మేనేజ్ మెంట్ కొత్తేమీ కాదు కదా. ఎవరిని ఎప్పుడు వాడాలో బహుశా బాబు గారికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. పైగా వచ్చే ఎన్నిక‌లంటే ఓ యుద్ధ‌మ‌నే చెప్పాలి. విజ‌యం త‌ప్ప‌, నీతి, నిజాయ‌తీల‌కు చోటు వుండ‌దు. కాబట్టి, అందుకు తగ్గట్టుగానే వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు సన్నద్ధం అవుతారు.

పైగా వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ?, వాటిని ఎలా ఎదుర్కోవాలి ? అనే విష‌యంలో చంద్ర‌బాబుకు తెలిసినంత‌గా మ‌రే నేత‌కు తెలియ‌దు. కానీ వైసీపీని ఎన్నిక‌ల్లో ఎదుర్కోవ‌డం నిజంగా కత్తిమీద సాము లాంటిదే. నేరుగా యుద్ధం చేసే వారితో దైర్యంగా పోరాడవచ్చు. కానీ జగన్ రెడ్డి లాంటి వినాశ నాయకుడు చేసే యుద్దాన్ని అన్ని విధాలుగా గమనిస్తూ పోరాడాలి. ఆ సమయంలో టీడీపీ అభిమానులు నిస్స‌హాయ స్థితిలో ఉండొచ్చు. కానీ వైసీపీ అక్ర‌మాల‌ను అడ్డుకుంటే విజయం ఈసారి తెలుగు దేశానిదే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!