HomeTelugu Trending'రిపబ్లిక్‌' నుండి జగపతిబాబు ఫస్ట్‌లుక్‌

‘రిపబ్లిక్‌’ నుండి జగపతిబాబు ఫస్ట్‌లుక్‌

jagapathi babu first look f
దేవ కట్టా డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్’. భగవాన్ – పుల్లారావు నిర్మించిన ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్, ఐశ్వర్య రాజేశ్ హీరో, హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా నుండి జగపతిబాబును ‘దశరథ్’ పాత్రలో పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

‘దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది’ అనే క్యాప్షన్ ను నినాదం తరహాలో పోస్టర్ పై రాశారు. మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సుబ్బరాజు .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu