HomeTelugu Big Storiesజేమ్స్‌ బాండ్ మూవీ ట్రైలర్ విడుదల

జేమ్స్‌ బాండ్ మూవీ ట్రైలర్ విడుదల

James Bond movie Trailer
జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు రాగా తాజాగా 25వ సినిమాగా ‘నో టైమ్‌ టూ డై’ రాబోతుంది. డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తోన్న 5వ సినిమా. జేమ్స్ బాండ్ మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు వస్తున్నాడు. ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘నో టైమ్ టు డై’ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అద్బుతమైన యాక్షన్ సీన్స్, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూస్తేనే అద్భుతంగా ఉందనిపిస్తోంది. ఇక సినిమా ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఈ చిత్రానికి కేరీ జోజీ దర్శకత్వం వహించాడు. తెలుగు సహా అన్ని భారతీయ భాషల్లోకి ఈ సినిమాను అనువదిస్తున్నారు. వేసవిలో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu