HomeTelugu Trendingజనసేన గుర్తులు గాజు గ్లాసు, బ్యాట్

జనసేన గుర్తులు గాజు గ్లాసు, బ్యాట్

 

15a

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. జనసేన తరపున అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతోంది. స్థానిక నాయకత్వం ఇప్పటికే అభ్యర్థుల్ని ఎంపికచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణవ్యాప్తంగా కసరత్తును మొదలు పెట్టినట్లు సమాచారం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తులు కాస్త మారాయంటోంది జనసేన. ఈ మార్పును గమనించాలంటూ పార్టీ తరపున ట్విట్టర్
ద్వారా ప్రకటన చేశారు. జడ్పీటీసీ ఎన్నికలకు గాజు గ్లాసు గుర్తుగా ఉంటుందని.. అయితే ఎంపీటీసీ ఎన్నికలకు మాత్రం బ్యాట్ గుర్తు ఉంటుందని తెలిపింది. ఎంపీటీసీకి గ్లాస్ గుర్తు లేనందున బ్యాట్ గుర్తు కేటాయించారని తెలిపింది. గుర్తు విషయంలో మార్పును గమనించాలని జనసేన చెబుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu