HomeTelugu Trendingరెండు కొత్త చిత్రాలు ప్రకటించిన తేజా.. టైటిల్స్‌ ఇవే..

రెండు కొత్త చిత్రాలు ప్రకటించిన తేజా.. టైటిల్స్‌ ఇవే..

6 21

స్టార్‌ డైరెక్టర్‌ తేజ ప్రేక్షకులకు డబుల్‌ ధమాకా ఇచ్చారు. శనివారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు. ‘అలిమేలు మంగ వేంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిళ్లతో వీటిని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు చిత్రాల్లోని ఒకదానిలో గోపీచంద్‌ హీరోగా నటించనుండగా మరొక దానిలో రానా హీరోలుగా కనిపించనున్నారు. ఇప్పటికే రానా-తేజ కాంబినేషన్‌లో విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు ‘జయం’, ‘నిజం’ సినిమాలతో గోపీచంద్‌లోని విలన్‌ను ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా తేజానే.

విభిన్న ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు తేజ. ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’, ‘జై’, వంటి చిత్రాలతో విజయాల తర్వాత వరుస పరాజయాలను చవిచూసిన ఆయన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ‘సీత’ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. ‘సీత’ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో ఆయన రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu