HomeTelugu Trendingముంబైకి మకాం మార్చేసిన మంచు లక్ష్మీ

ముంబైకి మకాం మార్చేసిన మంచు లక్ష్మీ

Manchu Lakshmi shifted to

మంచు లక్ష్మీ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఓ ట్వీట్ వేసింది. ఆ ట్వీట్‌తో మంచు లక్ష్మీ ముంబైకి మకాం మార్చేస్తుందా అనుమానలు వ్యక్త అవుతున్నాయి. ఇటీవలే.. రకుల్ బర్త్ డే పార్టీలో మంచు లక్ష్మీ సందడి చేసింది. ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ అందరూ కలిసి నానా హంగామా చేశారు.

వారి బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. మంచు లక్ష్మీ ఇప్పుడు ముంబైకి మకాం మార్చింది. అయితే బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయా? లేదా అవకాశాల కోసం ముంబైకి మకాం మార్చిందా? అంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.

న్యూ సిటీ, న్యూ ఎరా.. ఈ జీవితానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నన్ను నమ్ముతూ నా వెంటే ఉండే నా అభిమానులకు ధన్యవాదాలు అని మంచు లక్ష్మీ ట్వీట్ వేసింది. ఇకపై హిందీలో సత్తా చాటాలనుకుంటున్నట్టుగా తన మనసులోని మాటను మంచు లక్ష్మీ అక్కడి మీడియాతో పంచుకుంది.

ఇటీవలే మంచు లక్ష్మీ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపర్వం’ ఫస్ట్ లుక్ వచ్చింది. అమ్మోరు, అరుంధతి రేంజ్‌లో ఉంటుందని, అందులో మంచు లక్ష్మీ గెటప్, డైలాగ్స్, లుక్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని టాక్‌. మంచు లక్ష్మీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో నెగిటెవ్‌ రోల్‌లో ఆమె అద్బుతంగా నటించింది. మరి బాలీవుడ్‌లో మంచు లక్ష్మీ ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!