HomeTelugu Trendingనయనతార భర్తతో జాన్వీ కోలీవుడ్‌ ఎంట్రీ!

నయనతార భర్తతో జాన్వీ కోలీవుడ్‌ ఎంట్రీ!

janhvi kapoor movie with na

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దఢక్’ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తుంది. ఇక ఇటీవలే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. మరో సౌత్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు జాన్వీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఇంట్రెస్టింగ్ మూవీలో జాన్వీని ఫిమేల్ లీడ్‌గా ఎంపికైనట్లు టాక్‌.

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన హోమ్ బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘విక్రమ్’ మూవీ మాసివ్ హిట్ తర్వాత వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్న ఆయన.. తను నిర్మించే తదుపరి చిత్రం కోసం నటి జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్లుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మేల్ లీడ్‌గా నటించనున్నట్లు టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇటీవలే దర్శకుడు విఘ్నేష్.. జాన్వీని కలిసి మూవీ స్టోరీతో పాటు ఆమె రోల్ గురించి వివరించారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే, జాన్వీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ పట్ల ఆమె సానుకూలంగా ఉండగా. మరికొద్ది వారాల్లో తన కోలీవుడ్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu