HomeTelugu Big Storiesజాతిరత్నాలు డిలీటెడ్‌ సీన్స్‌ విడుదల

జాతిరత్నాలు డిలీటెడ్‌ సీన్స్‌ విడుదల

Jathi Ratnalu movie Deleted

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్ పోలిశెట్టి – ఫరీదా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ లో రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అనుదీప్ కేవీ డైరెక్షన్‌లో వచ్చిన ఈసినిమా స్వప్న సినిమాస్ పతాకంపై ‘మహానటి’ నాగ్ అశ్విన్ నిర్మించారు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా ఈ రత్నాల సందడి మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ‘జాతిరత్నాలు’ చిత్రం నుంచి డిలీటెడ్ సీన్స్ ని మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ సినిమాకి రథన్ సంగీతం సమకూర్చగా.. మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అభినవ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, సీనియర్ నరేష్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu