జనసేన పార్టీనా..? అదెవ్వరిది!

సహజనాటి జయసుధ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ పార్టీపై కొన్ని కామెంట్స్ చేశారు. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన జయసుధ ఆ తరువాత వచ్చిన 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూసింది. దీంతో వెంటనే టీడీపీ వైపు మొగ్గు చూపింది.

అయితే గత కొంతకాలంగా ఆమె జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ”జనసేన పార్టీనా.? అదెవ్వరి పార్టీ” అని అడిగారట. పవన్ పెట్టింది పవన్ కల్యాణ్ పార్టీ అని తెలుసు కానీ జనసేన పార్టీ అని మాత్రం తెలియదు అంటూ ఇంకొంత వివరణ ఇచ్చారు.

అంతేకాకుండా జనసేన పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని.. టీడీపీలోనే కంటిన్యూ అవుతానని ఆమె పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, నటి అయిన జయసుధకు పవన్ పార్టీ ఏంటో కూడా తెలియదా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.