జీవా, కాజల్ ల ప్రేమ ‘ఎంతవరకు..’!

జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ ‘కవలై వేండాం’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంత వరకు.. ఈ ప్రేమ’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా…. డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో సినిమా తెలుగు హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడింది. అయితే ఫ్యాన్సీ రేటు చెల్లించి తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాను. ‘ఎంతవరకు ఈ ప్రేమ’ అనే పేరుతో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘రంగం’ చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మిస్తుండ‌టం విశేషం.సినిమాపై ఉన్న అంచ‌నాల‌తో అల్రెడి రెండు ఏరియాల బిజినెస్ కూడా పూర్త‌య్యింది. మిగిలిన ఏరియాస్ కు మంచి బిజినెస్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. క్రేజీ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి” అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates