HomeTelugu Trending'జెర్సీ' ట్రైలర్‌

‘జెర్సీ’ ట్రైలర్‌

1 12నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘జెర్సీ’. ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. క్రికెటర్‌గా అర్జున్‌ మైదానంలోకి అడుగుపెట్టడం, సహచర ఆటగాళ్లతో గొడవపెట్టుకోవడం, శ్రద్ధతో ప్రేమలో పడటం తదితర సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. పదేళ్ల తర్వాత అర్జున్‌ (నాని) క్రికెట్‌కు దూరమై అటు ఉద్యోగం లేక ఇటు కుటుంబాన్ని నెట్టుకురాలేక సతమతమవడాన్ని చూపించారు. ‘పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..’ అంటూ నాని ఉద్వేగంతో చెబుతున్న డైలాగ్‌ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ఏప్రిల్‌ 19న ‘జెర్సీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!