HomeTelugu Trending'జిగర్‌ తండ డబుల్ ఎక్స్' ట్రైలర్‌ వచ్చేసింది

‘జిగర్‌ తండ డబుల్ ఎక్స్’ ట్రైలర్‌ వచ్చేసింది

Jigarthanda DoubleX Trailer

కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్‌, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జిగర్‌ తండ డబుల్ ఎక్స్’. 2014లో యాక్షన్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో విడుదలై త‌మిళంలో సూపర్ హిటైన ఈ సినిమా సీక్వెల్‌గా ఈ మూవీ వస్తోంది. ఈ మూవీకి కోలీవుడ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన అప్డేట్స్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలో మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

‘పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. అతనిలాంటి ఒక నల్లని హీరోను ఊహించుకుని చూడండి అంటూ ట్రైల‌ర్‌ మొదల‌వుతుంది. నలుపు అంటే అంత చులకనా నీకు అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ నడుస్తుండ‌గా.. సినిమాల్లో హీరో అంటే తెల్లగానే ఉండాలిగా మరి అనే చెప్పాగానే. తెలుగు సినిమాలో మొదటి నల్ల హీరో అంటూ.. గుర్రంపై వస్తున్న లారెన్స్‌ను ఎంట్రీ ఇస్తాడు.

ఈ సినిమా కథ 1975 నాటి రెట్రో స్టైల్‌లో సాగుతుందని ఈ ట్రైలర్ ద్వారా మేక‌ర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో గిరిజనులను కూడా చూపించడంతో కార్తీక్ సుబ్బరాజు ఏం ప్లాన్ చేసాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 10న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu